The New City Church Podcast - Telugu

The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Episodes

January 5, 2026 75 mins

ఒక విశ్వాసి తన జీవితములో ముందుకు సాగి స్వాధీనపరచుకొనుట అంటే ఏమిటి?

2026లోని మొదటి బ్రేక్త్రూ ఆదివారాన బోధింపబడిన ఈ ప్రభావవంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడు విశ్వాసులమైన మనకొరకు ఉంచిన వాటన్నిటినీ మనము సొంతం చేసుకోవడానికి మనలను బలపరిచే ఆత్మీయ సూత్రాలను పంచుకుంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల, స్పష్టత మరియు నిరంతర అభివృద్ధికి మూలమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుట యొక్క కీలకమైన పాత్రను వారు ఇక్కడ నొక్కి చెబుతున్నా...

Mark as Played

క్రీస్తు పరిపూర్ణతలో జీవించుట అంటే ఏమిటి? ‘క్రీస్తు పరిపూర్ణతను పొందుట ఎలా?’ అనే ఈ శక్తివంతమైన వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తు పరిపూర్ణత అంటే సంపూర్ణ విమోచన అని వివరిస్తున్నారు. వారు ప్రతి విశ్వాసి జీవితములో పాపము నిర్మూలించబడిందని వెల్లడిస్తూ నూతన నిబంధన క్రింద మన రక్షణ నిమిత్తము శాశ్వతంగా పూర్తి వెల చెల్లించిన క్రీస్తు రక్తము యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతున్నారు. 

విశ్వాసులు నూతన నిబంధన మనస్తత్వాన్న...

Mark as Played
December 27, 2025 56 mins

అద్భుతాలకు మీ సమయమిదే. ఈ క్రిస్మస్ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు క్రీస్తు యొక్క అద్భుత జననాన్ని గుర్తు చేస్తూ, విశ్వాసులు అద్భుతాలలో నడచుటకున్న దీవెనను గురించి తెలుపుతున్నారు. 

క్రీస్తు శతృవు యొక్క కార్యాల మీద విజయాన్నెలా పొందాడో తెలుసుకొని, మీ ఆరోగ్యము, కుటుంబము, ఆర్ధిక విషయాలు, వృత్తి, పరిచర్య ఇంకా మరిన్ని రంగాలలో అద్భుతాలను చూచుటకు విశ్వాసంతో వాక్యాన్ని స్వీకరించండి!

మీ దృష్టిని దేవుని వాక్యము పై నిలిపి...

Mark as Played

అద్భుతాలు అరుదుగా జరుగుటకు ఉద్దేశించబడ్డాయా లేదా అవి విశ్వాసులకు రోజువారీ వాస్తవికతగా ఉండాలా? ‘అద్భుతములు’ అను ఈ శక్తివంతమైన సందేశంలో, దేవుని రాజ్యంలో అద్భుతాలు ఏదో అప్పుడప్పుడు జరిగే సంఘటనలుగా, మన జీవితాల్లోని కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైనవిగా ఉండకూడదు కానీ ప్రతి రోజూ విశ్వాసులు తమ జీవితాల్లోని ప్రతి రంగములో అనుభవిస్తూ ఉండాల్సినవైయుండాలని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తున్నారు. అద్భుతాల కొరకు మనమెందుకు పోరాడాల...

Mark as Played

మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా?  ట్రాఫిక్లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే.

ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పనులకు, మాటలకు, ఆలోచనలకు, డబ్బును వాడే...

Mark as Played

స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు. 

ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్రియల ద్వారా ఎలా విశదమవుతుందో మరియు ...

Mark as Played

మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా?

కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ పనిని చక్కగా పూర్తి చేసినందుకై ఎలా ...

Mark as Played

ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు. 

ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూపుదిద్దుతుందో కనుగొనండి. కృతజ్ఞత యొ...

Mark as Played

క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా?

పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన నిబంధన విశ్వాసులు దేవుని బహుమానాలు మాత్రమే కాదు కానీ, క్రీస్తు న్యాయపీఠము వద్ద మన కొరకు వేచియున్న ప్రతిఫలాలను పొందుకొనే జీవితాన్ని జీవించే బాధ్యత మనకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు 

మీ ప్రతి మంచి పనికి సమృద్ధిగా ప్రతిఫలం పొందుటకు క్రీస్...

Mark as Played

మీలో ఉన్న క్రీస్తు జీవము అనే సర్వ సత్యములో మీరు నడుస్తున్నారా? ఈ శక్తివంతమైన సందేశంలో, క్రీస్తు నుంచి మనము పొందుకున్న జోయే – దేవుని వంటి జీవము – అనే ప్రత్యక్షతను పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు మనకు చూపిస్తున్నారు. 

సమాచారము మరియు ప్రత్యక్షత మధ్య తేడాలను కనుగొని, సహజ ప్రపంచానికి మించిన సహజాతీతమైన ప్రపంచములోనికి ఎలా చూడగలమో ఈ వర్తమానంలో తెలుసుకొనండి. శతృవు మారువేషము ధరించి మిమ్మల్ని ఇక ఏ మాత్రమూ మోసపరచనివ్వకండి. సిలువపై ఆయన పూర్తిచేస...

Mark as Played

మంచి ఆరోగ్యము, సఫలవంతమైన సంబంధాలు, తృప్తినిచ్చే ఉద్యోగము లేదా సేవా పరిచర్య కలిగియుండుట చాలా కష్టం అనిపిస్తుందా? ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు క్రీస్తులోని సరళత ద్వారా ఈ ఆశీర్వాదాలన్నిటినీ మనము సుళువుగా ఆస్వాదించే రహస్యాన్ని వెల్లడిస్తున్నారు.

ఈ వర్తమానంలో నూతన నిబంధన పాత నిబంధనను ఎలా  అధిగమిస్తుందో, ఈ రెండింటినీ కలపడం వల్ల కలిగే ప్రమాదాలను మనము కనుగొంటాము మరియు దేనినైనా పొందుకొనుటకు దేవుని కృప, మన విశ్వాసమే కీ...

Mark as Played

దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో  ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి. 

ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు: •⁠  ⁠సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవం...

Mark as Played

ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి. 

మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన.

మీరు అమితంగా ఆశీర్వదించబ...

Mark as Played

గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి!

రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు. 

మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశి...

Mark as Played

అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు. 

మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన. 

దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉ...

Mark as Played

గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. 

బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి. 

మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూ...

Mark as Played
September 25, 2025 65 mins

The Glory of God, The Victory of All

In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God’s glory to see real change in the world around us. 

As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God’s glory in and through your life.

May your life be filled with the glory of God. In Jesus' name, Amen!

దేవుని మహ...

Mark as Played
September 17, 2025 67 mins

మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర!

ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి  ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు. 

మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థ...

Mark as Played

విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం

ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు.   మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన. 

నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమ...

Mark as Played

దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు. 

ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న  ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి,  విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన.

మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!

Mark as Played

Popular Podcasts

    If you've ever wanted to know about champagne, satanism, the Stonewall Uprising, chaos theory, LSD, El Nino, true crime and Rosa Parks, then look no further. Josh and Chuck have you covered.

    The Joe Rogan Experience

    The official podcast of comedian Joe Rogan.

    Two Guys, Five Rings: Matt, Bowen & The Olympics

    Two Guys (Bowen Yang and Matt Rogers). Five Rings (you know, from the Olympics logo). One essential podcast for the 2026 Milan-Cortina Winter Olympics. Bowen Yang (SNL, Wicked) and Matt Rogers (Palm Royale, No Good Deed) of Las Culturistas are back for a second season of Two Guys, Five Rings, a collaboration with NBC Sports and iHeartRadio. In this 15-episode event, Bowen and Matt discuss the top storylines, obsess over Italian culture, and find out what really goes on in the Olympic Village.

    The Clay Travis and Buck Sexton Show

    The Clay Travis and Buck Sexton Show. Clay Travis and Buck Sexton tackle the biggest stories in news, politics and current events with intelligence and humor. From the border crisis, to the madness of cancel culture and far-left missteps, Clay and Buck guide listeners through the latest headlines and hot topics with fun and entertaining conversations and opinions.

    Dateline NBC

    Current and classic episodes, featuring compelling true-crime mysteries, powerful documentaries and in-depth investigations. Follow now to get the latest episodes of Dateline NBC completely free, or subscribe to Dateline Premium for ad-free listening and exclusive bonus content: DatelinePremium.com

Advertise With Us
Music, radio and podcasts, all free. Listen online or download the iHeart App.

Connect

© 2026 iHeartMedia, Inc.